కొన్ని విషయాలు.. భర్తలు బొట్లు మార్చినంత సులువు కాదు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గర పడుతున్నప్పుడు నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్ కానీ హద్దులు మీరి నోరు జారడం సరికాదు..! అయితే కొంత కాలాంగా చూసుకుంటుంటే నేతలు ఇలాగే హద్దులు మీరి విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా నేతలపై నోరు జారీ వివాదాల్లోకి వెళుతున్నారు. మొన్న ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ కూడా ఇలానే నోరు జారారు కొందరు నేతలు ఇటీవలే కేంద్ర మంత్రి స్మృతి ఇరానినీ ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ నేత జయ్‌దీప్ కవాడే ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. తన నుదుటిన బొట్టు గురించి ఆమె భర్తల గురించి ఆయన విమర్శలు చేశారు. జయదీప్ మాట్లాడుతూ…స్మృతి ఇరానీ తరచూ రాజ్యాంగాన్ని మార్చమని అంటుంటారు…అయితే ఆవిడ గురించి నేను ఒక విషయం చెప్పదలచుకున్నా…స్మృతి ఇరానీ నుదుటిపై ఒక పెద్దగా బొట్టు పెట్టుకుంటుంది. అయితే సాధారణంగా భర్తలను మార్చే కొందరు మహిళలు వాళ్ల బొట్టు సైజు పెంచుతూ పోతుంటారు. అలాగే వారి నుదుటిన బొట్టు పరిణామం కూడా పెరుగుతూనే ఉంటుంది… స్మృతి ఇరానీ పార్లమెంటులో, కేంద్ర మంత్రి గడ్కరీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటూ మాట్లాడుతుంటారు. అయితే రాజ్యాంగాన్ని మార్చడం అంటే భర్తలను మార్చినంత ఈజీకాదు అంటూ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: