కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన సంగారెడ్డి కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే పార్ల్మెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కాలి అని పిలుపునిచ్చారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి, ఇంటిటి ప్రచారం చెయ్యాలి…! టీఆరెస్ పార్టీ దగ్గర డబ్బులున్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరికీ వారు స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పనిచెయ్యాలి అని ఆయన వాళ్ళతో అన్నారు.
జగ్గారెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. జగ్గారెడ్డి కేసులకు బయపడుతున్నాడన్న, జగ్గారెడ్డి ఏటీఎంలు ఏమైనాయన్న హరీష్ వ్యాఖ్యల పై మండిపడ్డారు. జగ్గారెడ్డి కేసులకు భయపడే వ్యక్తి కాదు.. అలా బయాడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం పై పోరాడే వాడిని కాదు అని ఆయన అన్నారు. అవును నేను ఆపదలో ఉన్న వారికి కచ్చితంగా ఏటీఎం నే.. నా సంగారెడ్డి ప్రజలకు ఆ విషయం తెలుసు.. నేను ఎంతమందికి ఆర్థిక సహాయం చేసానో, నువ్వెంతమందికి చేసావో చర్చకు సిద్ధమా?అంటూ ఆయన హరీష్ రావు కి సవాల్ విసిరారు.