రాజ్‌నాథ్ నోట.. మోదీ పథకాల పాట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి.. దేశ నేతలు పార్టీ ప్రముఖులు ప్రచారాలు చేసే దిశలో పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు తెలంగాణ లో పర్యటించారు ముంది నిజామాబాద్ లో సభ నిర్వహించిన ఆయన అనంతరం అక్కడనుండి మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా లోని బిజెపి విజయ సంకల్ప సభ లో ఆయన పాల్గొన్నారు.. ఆయన మోదీ గురించి గత అయిదేళ్లుగా జరిగిన భివృద్ది గురించి పలు అంశాలని ప్రసంగించారు.

అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు రాజనాధ్.. పార్లమెంట్ అభ్యర్థి హుస్సేన్ ధైర్యం, విజన్ కలిగిన వ్యక్తి.. డిసెంబర్ లో ఎన్నికలు జరిగాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసింది.. దేశంలో ప్రధానిగా మోడీ గారు మరోసారి కావలసిన అవసరం ఉంది.

అంతర్జాతీయ ద్రవ్యానిది లెక్కల ప్రకారం 2028లో ప్రపంచంలో 3 వ పెద్ద దేశంగా అవతరిస్తుంది.. కాంగ్రెస్ 10 సంవత్సరాలో 25 లక్షల ఇల్లు నిర్మిస్తే, మోడీ ప్రభుత్వం హయాంలో 1కోటి 20 లక్షల ఇల్లు నిర్మించింది. మోడీ ప్రభుత్వం గ్యాస్ లేని ప్రతి పేద వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది.. గ్యాస్ సిలిండర్, సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి మంజూరు చేస్తాం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పధకం ద్వారా 5 ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6000 రూపాయలు అందించడం జరుగుతుంది..

దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం జరుగుతుంది.. 16 వేల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించడం జరిగింది.. అటల్ జీ, మోదీ ప్రభుత్వంలో ఎలాంటి కుంభకోనాలు జరగలేదు. అది బీజేపీ ప్రభుత్వం పనితీరు.. మోడీ సర్కారు రాక ముందు 18 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు విద్యుత్ ను అందించడం జరిగింది. అంత్యంత వేగంగా అభివృద్ధి మోడీ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది.. 2014 కు ముందు కేవలం రెండు కంపెనీలు భారతదేశం లో ఉన్నాయి ,4 సంవత్సరం లో మేకిన్ ఇండియాలో భాగంగా 120 కంపెనీలు దేశంలో ఉన్నాయి..

ఐరన్ ఉత్పత్తిలో భారత దేశం అగ్రస్థానం లో ఉంది.. రక్షణ రంగంలో మోడీ ఆధ్వర్యంలో అత్యంత శక్తి వంతంగా తయారైంది.. సైన్యం ,పోలిస్ వ్యవస్థ లు ఏదైనా విజయం సాధించినప్పుడు పార్టీలకు అతీతంగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది.. మోడీ ప్రభుత్వం హయాంలో అంతరిక్షంలో కూడా భారత్ దేశం ఉన్నత స్థాయికి చేరింది.. ఎలాంటి అవినీతి బీజేపీ ప్రభుత్వం చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం రఫెల్ కుంభకోణం జరిగింది అని ప్రచారం చేస్తుంది.. ప్రభుత్వ పథకాలు మధ్యవర్తితో సంభందం లేకుండా లబ్ది దారులకు చేరుతుంది.. పోడు భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది.. హుస్సేన్ నాయక్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.. అంటూ ఆయన ముగించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: