ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకి తోడుగా ఉంటామని యువనేస్తం పేరిట నెలకి 2000 రూపాయలు సహాయం చేస్తానని ప్రకటించారు. అయితే డిగ్రీ అరుహాలై నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ యువనేస్తం వర్తిస్తుంది. ఈ పథకంతో చంద్రబాబు ప్రభుత్వం పై ఉన్న విశ్వాసం ప్రజల్లో మరింత పెరిగింది. అయితే తాజాగా ఈ యువనేస్తం పేరిట ప్రజలకి మరో వారం ఇచ్చాడు చంద్రబాబు.
ప్రచారం లో భాగంగా ఆయన చిత్తూరు జిల్లా పుత్తూరులో ప్రసంగిస్తున్నప్పుడు మరో వారం ఇచ్చాడు.. ఇక పై ఇటర్ చదివితే చాలు నిరుద్యోగ బృతి అందిస్తామని డిగ్రీ అర్హత నుండి దాన్ని ఇంటర్ చేసినట్టుగా ఆయన ప్రకటించారు. అంటే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా వర్తింపజేయాలనుకుంటున్నట్టు ప్రకటన చేశారు.