హైదరబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ ఘటన చోటు చేసుకుంది. అది అధికారుల నిర్లక్ష్యమో..! అనుమతులకి మించి శిక్షించిన విధానమో..? మరి ఇంకేమయినా కారనమో..కానీ అక్కడ ఉన్న ఒక నిందితుడు లాకప్ లో ఉండగానే మృతి చెందాడు. ఈ ఘటన నేడు ఉదయం 6 గంటలకి చోటు చేసుకుంది.
అమీర్పేట సారధి స్టూడియోస్ వద్ద జరిగిన హత్య కేసులో అనుమానస్తులని అదుపు లోకి తీసుకున్నారు ఎస్సార్ నగర్ పోలీసులు. అనుమానస్తులని విచారణ నిమిత్తం లాకప్ లో ఉంచారు. పోలీసుల మద్య లాకప్ లో ఉన్న ఒక నిందితుడు ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన మిగితా సిబ్భంది ఎన్నిసార్లు పిలిచినా పోలీసులు స్పందించలేదు. ఇక అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయిన దృశ్యాలు ఆధారంగా అసలు విషయం భయటకొస్తుంది. ఇక లాకప్ లో మరణించిన నిందితుడిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇక అక్కడ ఏం జరిగిందో అనే విషయం విచారిస్తున్నారు.. వాస్తవాలు మరి కొద్ది సేపట్లో బయటకొస్తాయి.