కేసీఆర్ కి ఓటు వేయొద్దు..! కేసీఆర్ కి ఓటేస్తే మోడీకి వేసినట్టే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశ ప్రధాని పై తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మోదీ లవి అన్నీ మాయ మాటలే వాటిని నమ్మోద్దు అని ఆమె హితువు పలికారు.

ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ వి అన్నీ మాయ మాటలే వాటిని నమ్మోద్దు అని ఆమె ప్రజలతో అన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేయడం కోసం కేసీఆర్‌ అనేక మాయమాటలు చెబుతారని వాటిని పట్టించుకోవద్దన్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని, మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

ఇక బీజేపీ గురించి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మోదీ విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొస్తానని, ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును ఖాళీ చేసిన ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయాడని స్పష్టం చేశారు. బీజేపీ చేపట్టిన నోట్లరద్దు, జీఎస్టీ వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వీరిని నమ్మోదని కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కనీస ఆదాయ పథకం కింద ప్రతి నెలా రూ.6వేల చొప్పున పేదల ఖాతాల్లో వేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: