మహేశ్ అభిమానులకి ‘మహర్షి’ ఉగాది కానుక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున 25 వ చిత్రం మహర్షి. సినిమాపై అభిమానులకి ఎంతగానో అంచనాలు ఉన్నాయి ఇక ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. మహర్షి సినిమాని దిల్ రాజు అశ్విని దత్ లు కలిసి నిర్మిస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. కథలో మహేశ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది.. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది అదే అల్లరి నరేశ్ పాత్ర. అల్లరి నరేశ్ ఈ సినిమాలో మహేశ్ మిత్రుడిలా మంచి ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు సినిమా దాదాపుగా పోర్తి అయ్యింది అనే చెప్పాలి సినిమా చివరి దిశ షూటింగ్ పనులు ఉన్నాయి.. ఇక ఎడిటర్స్ కి కొంత పని ఉంది. అయితే సినిమా ఎపుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేశ్ అభిమానులకి చిత్రా యూనిట్ ఒక ట్వీటు తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఏప్రిల్ 6 న ఉదయం 9.09 గంటలకి ఈ సినిమా తీజర్ ప్రేక్షకుల ముందుకి రాబోతుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉగాది కానుకగా ఈ సినిమా తిజర్ ని అభిమానులకి కానుకగా ఇస్తునట్టు చిత్రా యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా ని మే నెల 9 వ తారికున ప్రేక్షకులముందుకు తీసుకురడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: