ఎలాన్ మస్క్ 1 నిమిషంలో 1 బిలాన్ డాలర్లు వెనక్కి పడ్డాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలాన్ రీవి మస్క్ ప్రముఖ వ్యాపార వేత్త స్పేస్ ఎక్స్ సెంటర్ అధినేత, ఇంజినీర్..! ప్రపంచంలోనే అత్యంత ధనికుల లిస్ట్ లో ఈయన కూడా ఒకడు. టెస్లా అనే కార్ల కంపెనీకి కూడా ఈయనే అధినేత.. ఎలక్ట్రానిక్ చార్జింగ్ తో నడిచే కార్లు తయారీ చేసి కంపెనీ ఇది. ఈ కంపెనీ ద్వారా ఎలాన్ మాక్ దాదాపుగా 10 బిలియన్ డాలర్లు సంపాదించాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం.. 69 వేల కోట్లకి పై మాటే..! ఇక పోతే స్పేస్ ఎక్స్ సెంటర్ లో రాకెట్ లు శ్యాటిలైట్ లు తయారీ చేస్తూ ఇప్పటికే వందల కోట్లు సంపాదించేశాడు. దాదాపుగా 13 బిలియన్ డాలర్లు సంపాదించాడు అంటే భారత కరెన్సీ ప్రకారం.. 90 వేల కోట్లకి పైమాటే.. అయితే ఈ మల్టీ బిలియనీర్ నేడు ఉదయం కేవలం రెండు నిమిషాల్లోనే 1.1 బిలియన్ డాలర్లు నష్టపోయాడు.. అంటే భారత కరెన్సీ లో దాదాపుగా 7,572 కోట్లు..! ఇంత డబ్బుని కేవలం రెండు నిమిషాల్లో నష్టపోయాడు అయిన కూడా ఈయన ఆస్తి ఏమాత్రం తగ్గలేదు. ఇది వరకు లెక్కల ప్రకారం ఈయన దేగ్గర 23.4 బిలియన్ డాలర్లు ఉంటే ఇప్పుడు అవి 22.3 డాలర్లకి చేరింది.

అంతా డబ్బు కేవలం రెండు నిమిషాల్లో ఎలా నష్టపోయాడు అని అనుకుంటున్నారా..? ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న టెస్లా, ఈ సంవత్సరం తొలి మూడు నెలల వ్యవధిలో అమ్మకాలను ఏ మాత్రం పెంచుకోలేక పోయింది. 2018 అక్టోబర్ – డిసెంబర్ మధ్య కాలంలో 90,966 యూనిట్లను విక్రయించిన సంస్థ ఈ జనవరి – మార్చి మధ్య 63 వేల యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ గణాంకాలు బహిర్గతం కాగానే, టెస్లా పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, భారీ ఎత్తున ఈక్విటీలు అమ్మకానికి వచ్చాయి. దీంతో ఆయనకి మొత్తం ఆస్తి 159 వేల కోట్లు ఉండగా ఇప్పుడు 151.4 వేల కోట్లకి చేరింది.

Share.

Comments are closed.

%d bloggers like this: