బాహుబలి తరువాత జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ లను కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు గా చూపించబోతున్నారు. వీరి సరసన్ నటించే కథానాయికలు ఒకరిని బాలీవుడ్ నుంచి అళియ భట్ ని మరొకరు హాలీవుడ్ నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ ని తెప్పించారు. దేశ వ్యాప్తంగా సినిమాని సక్సెస్ చేయడానికి రాజమౌళి ఎంతగానో కష్ట పడుతున్నారు. ఆధుతమైన విజువల్ ఏకేక్ట్స్ తో పాత కథ కాబట్టి అప్పటి కార్లని ఇళ్లని చూపించి రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. సంగీతం కీరవాణి అందిస్తున్నారు.. డీవీవీ దానయ్య సినిమాని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటినుండి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. గుజరాత్ లో మూడు వారాల షెడ్యూల్ కి వెళ్ళిన చిత్రా బృందం వెళ్ళగానే ఆటంకం ఎదుర్కుంది.. మెగా హీరో రామ్ చరణ్ కి రాజమౌళి శరీర విషయమై నిబంధనలు పెట్టాడు ఇక జిమ్ చేస్తున్న చరణ్ కి కాళి చీలి మడత లో గాయం అయ్యింది డాక్టర్లు మూడు వారాలు రెస్ట్ తీసుకోమన్నారు. ఇక దీంతో ఆగకుండా ఎన్టీఆర్ సరసన నటిస్తున్న డైసీ ఎడ్గార్ జోన్స్ రాజమౌళికి షాక్ ఇచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చిత్రం నుంచి తప్పుకుంటునట్టుగా రాజమౌళి తో చెప్పింది. ఇక ఇదే విషయాన్ని RRR టిమ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు ఆమెకి మంచి ఫ్యూచర్ ఉండాలి అంటూ ఆమెకి వీడ్కోలు చెప్పారు.
Due to unavoidable circumstances, @DaisyEdgarJones is no longer a part of our film. We hope she has a brilliant future. #RRR
— RRR Movie (@RRRMovie) April 5, 2019