కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా అధికారుల బదిలీలపై స్పందించారు. ఎన్నికల వేల అధికారుల బదిలీ ఏంటని ఆయన ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ బదిలీ ఎందుకు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ చంద్ర పూనేఠా ను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాల్సిందిగా ఆయన కోరారు. నాకు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉంది కానీ ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి ఎన్నికల కమిషన్ ని చూడలేదు అని ఆయన మండిపడ్డారు.
ప్రధాని హోదాలో ఉన్న మోదీ అనైతిక రాజకీయాలతో వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ఆదాయపు శాఖ ని తన చేతుల మిడిగా ఆడిస్తున్నాడని ఈ రెండు శాఖలు ఆయన కనుసన్నలో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని ఆయన మండి పడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. మోదీ కి కేసీఆర్ జగన్ లు మద్దత్తుగా ఉన్నారని అందుకే వారితో సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయం లో ఐటీ దాడులు చేయించి వారి ఆత్మ విశ్వాసాని దెబ్బ తీయడం సారి కాదని ఆయన అన్నారు. మోడీకి దమ్ముంటే కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపై దాడులు జరపమని ఆయన సవాల్ చేశారు.