మమతా బాబులే.. ఈసీ టార్గెట్ ఆ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ఎన్నికల సంఘం పై దేశ వ్యాప్తంగా నేతలు మండిపడుతున్నారు. మోదీ చెప్పినట్టుగా ఐటీ ఈసీ శాఖలు నడుచుకుంటున్నాయని కీలు బొమ్మళ్ళా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈసీ చోరువు చేసుకొని అధికారులని బదిలీ చేయించింది. ఇద్దరు జిల్లా ఎస్పీలతో పాటు ఇంటలిజెన్స్ డీజీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం ఈసీ బదిలీ చేయించింది.. దీంతో ఒక్కసారిగా ఏపీ నేతలు ఈసీ పై మోడి పై బగ్గుమన్నారు.

ఇక ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ లోనూ ఈసీ చోరువ తీసుకొని అధికారులని బదిలీ చేయించింది. అక్కడ కూడా అధికారులని బదిలీ చేయించారు. ఎన్నికలు దేగ్గరకి వచ్చేస్తున్న నేపద్యంలో ఈసీ ఇలాంటి చర్యలు చేపట్టడం పై అక్కడి నేతలు బగ్గుమంటున్నారు. పశ్చిమ బంగాల ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ బదిలీలపై సప్న్దిస్తూ మోడి పై ఈసీ పై నిప్పులు చెరిగింది ఆమె మాట్లాడుతూ.. ఈసీ కేవలం అధికారులు మాత్రమే తొలగించగలుగుతోందని, చేతనయితే తనను తొలగించి చూడాలంటూ సవాల్ విసిరారు. విధి నిర్వహణలో ఎంతో నిజాయతీపరులుగా పేరున్న అధికారులను తొలగించడం ఎందుకో తెలియడంలేదని అన్నారు. స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆమె ఆరోపించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: