కోట్లు..వ్యాపారాలు ఉన్న వ్యక్తులు కావాలా..? పోరాడే గొంతు కావాలా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో మాట్లాడిన రవంత్ రెడ్డి కేసీఆర్ ని టీఆర్ ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ని ఏకీపారేశాడు.. గెలిచిన తరువాత ఇంట్లో పడుకునే నాయకుడు కావాలా ప్రజల కొరకు పోరాడే నాయకుడు కావాలా అని ఆయన ప్రజలని అడిగాడు.

ఆయన మాట్లాడుతూ.. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకీ టీఆర్ఎస్ కి సంబంధం లేదు.. ఈ ఎన్నికలు జాతీయ పార్టీలు మధ్య జరిగే ఎన్నికలు అని ఆయన అన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురికి ముగ్గురు ఓడిపోయేసరికి గెస్ట్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కి ఉన్నట్టుండి రైతు గుర్తొచ్చాడు..! ఎమ్మారో ని విధులెంబడి ఉరికించాడు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. వెంబడే సచివాలయానికి దిగోస్తాడు సక్రమంగా పనిచేస్తాడు.. ఓటు అనేది మీ ఆయుధం దాన్ని సరిగ్గా ఉపయోగించి మంచి బుద్ధి చెప్పండి అని ఆయన అన్నారు.

ఇక మల్కాజిగిరి బీజేపీ టీఆర్ఎస్ అభ్యర్థులని ఉద్దేశిస్తూ.. బీజేపీ రామచందర్ రావు ఢిల్లీ నుండి నిధులు తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయాడు.. వేలం పాటలో సీటు కొని పోటీ చేస్తున్నాడు.. వాళ్ళకా మీరు ఓటు వేసేది..? ఇక మామ మంత్రి మల్లారెడ్డి వందల ఎకరాల భూమి కోట్లకొద్ది రూపాయలున్న తన అల్లుడి మర్రి రాజశేఖర్ రెడ్డి కి సీటు కొనిచ్చాడు.. వందల కోట్లు వ్యాపారాలు ఉన్న వ్యక్తులు కావాలా..? పేదల కొరకు కొట్లాడుతున్న నేను, దౌర్భాగ్యంగా 100 కేసులు పెట్టిన కూడా పెదలకొరకే పాటుపడే నేను కావాలా…? పేదల కోసం కొట్లాడాలి.. ప్రశ్నించే గొంతు ఉండాలి.. ఎదిరించే శక్తి ఉండాలి.. అందుకే నన్ను గెలిపించండి. మేడ్చల్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేయండి అని ఆయన ప్రజలకి చెప్పుకొచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: