దమ్ముంటే పంపండి..2 గంటల్లో తేలిపోతుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను మాట్లాడినట్లు మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో టేపుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆ గొంతు తనది కాదని వివరణ ఇచ్చారు. తాజాగా, ఇదే అంశంపై ట్విట్టర్‌లో స్పందించిన ఆయన, చంద్రబాబు టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఫేక్ ఆడియోలు వదిలి, ప్రజలు ఉమ్మిలో కొట్టుకు పోతూ గడ్డిపోచ పట్టుకుని ఎదురీదాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అన్నిటికీ దిగజారిన వ్యక్తులు మా వ్యక్తిత్వాలపై బురదజల్లడం ఊహించిందే. దమ్ముంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపండి. 2 గంటల్లో తేలుతుంది నిజమైనదో కాదో?’ అని సవాల్ విసరారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు.

అంతేకాదు, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను కామిక్స్ బుక్‌తో పోల్చారు. చంద్రబాబు హామీలు తుపాకి రాముడి కోతల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అద్దంలో చందమామలను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగులు వలస వెళ్లేలా చంద్రబాబు చేశాడన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. అలాగే ‘రాష్ట్రంలోని అంగన్వాడీలన్నింటికీ సొంత భవనాలు కట్టేశామని మీ తనయుడు లోకేశ్‌ చెప్పినవి పచ్చి అబద్ధాలన్నట్టేగా? 15,358 అంగన్వాడీ కేంద్రాలకు బిల్డింగులు కడతామని మేనిఫెస్టోలో పెట్టారు. నర్సరీ, ప్రీప్రైమరీ స్కూళ్లన్నీ బోగస్. 1995 నుంచి చెప్పిన కథలే రిపీట్ చేస్తున్నారు’ అని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: