చేవెళ్ళ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ పై ద్వాజమెత్తారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కేసీఆర్ పై ఆయన కుటుంబ పాలన పై విమర్శలు చేశారు. అడిగే గొంతుని పార్లమెంట్ కి పంపకుండా ఆపుదామని కేసీఆర్ ప్రాయత్నిస్తున్నాడని ఆయన ప్రయత్నాలు ఈ ఎన్నికల్లో విఫలమవుతాయని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అమలుకు సాధ్యం కానీ హామీలు చేస్తున్నారని గతంలో కూడా అవి చేస్తాము ఇవి చేస్తాము అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ హామీలు చేసి అన్నీ నెరవేరుస్తామని చెప్పి చెప్పి మోసం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మోసం చేసిన వారిని తెలంగాణ ప్రజలు నమ్మారు అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల్లో ను అమలుచేయలేని హామీలను కేసీఆర్ ఇస్తున్నారు అని ఆయన ద్వజమెత్తారు.
చేవెళ్ల గడ్డ మీద ప్రశ్నించే నాయకుడు లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు అని ఆయన అన్నారు.. ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి నిలబెట్టుకుంది.. ఒకే దఫా రుణమాఫీ చేస్తామని చెప్పాం…మాట నిలబెట్టుకున్నాం అని ఆయన అన్నారు. చేవెళ్ల సభకు కేటిఆర్ ఇతర జిల్లాల నుంచి ప్రజలను ఇంపోర్ట్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.. చేవెళ్లలో 70 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని గుర్తు చేశారు. ఇది స్థానికుడు, స్థానికేతారుడు పోరాటం కాదు… రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం జరుగుతున్న పోరాటం.. రానున్న ఎన్నికల్లో మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేను నా కుటుంబమే పాలిస్తామనే తీరుగా కేసీఆర్ పాలన నడుస్తుంది ఇక ఆ పాలన కి ప్రజలే సమాప్తి చెబుతారు అని ఆయన విరుచుకపడ్డారు.