సుప్రీంకోర్టు లో రివిజన్ పిటీషన్ వేస్తాం..! వీవీప్యాట్ లనే లెక్కించాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈవీఎం మిషన్ల వల్ల తారుమారు అవకాశం ఉందని.. దీనికి గాను అన్నీ నియోజకవర్గాల్లో ఈవీఎంల బదులు వీవీప్యాట్ బాక్సులని లెక్కించాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ సహా 21 పార్టీలు సుప్రీం కోర్ట్ లో పిటీషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లకి ఈసీ మొత్తం వీవీప్యాట్ లు లెక్కించడానికి 9 రోజుల వరకు పడుతుందని.. జాప్యానికి దారి తీస్తుందని కౌంటర్ పిటీషన్లు వేసింది. ఇక రెండు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్ట్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వీవీప్యాట్ లను లెక్కించాలని.. పార్లమెంట్ నియోజకవర్గానికి 30 వీవీప్యాట్ బాక్సులని లెక్కించాలని తీర్పు నిచ్చారు.

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం నాడు కృష్ణా జిల్లా తిరుపురంలో నిర్వహించిన సభలో ఆయన ప్రస్తావించారు. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. వీవీప్యాట్ విషయంలో తాము చేసిన డిమాండ్ లని ఈసీ పట్టించుకోవడం లేదని ఈసీ తీరుని తప్పుబట్టారు. టమాటో పాటు కలిసి 21 రాష్ట్రాల పార్టీ వారు పిటిషన్లు వేస్తే సుప్రీం కోర్టు కేవలం నియోజకవర్గం నుండి 5 ఈవీఎం లని మాత్రమే లెక్కిస్తామని వెల్లడించిన తీరుని ఆయన ప్రజలతో చెప్పారు.

ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 వీవీప్యాట్ లని కాదు కనీసం 25 శాతం ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వసనీయత పొందాలంటే కనీసం 25 శాతం వీవీప్యాట్ లని లెక్కించే అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయమై అవసరమైతే సుప్రీంకోర్టులో రివిజన్ పిటీషన్ ని దాఖలు చేస్తామని ఆయన ప్రకటించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: