కన్నబాబు గెట్ అవుట్ ఆఫ్ కాకినాడ..! వైసీపీ గెట్ అవుట్..!- పవన్

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ లో పర్యటించారు. కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పై పవన్ ఘాటు విమర్శలు చేశారు. కన్నబాబు నిన్ను తరిమి తరిమి కొడతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు ఒక చెంచా అని తినడానికి కూడా పనికిరాని చెంచా అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన అన్నయ్య మెగాస్టార్ కన్నబాబు ని ఇష్టంగా చేరదీశారని పవన్ గుర్తు చేశారు. ఎంతో ఇష్టంగా నిన్ను చేరదీస్తే నివి ఆ గట్టున తిని వైసీపీ కి వెళ్తావా అంటూ దుమ్మెత్తిపోశారు.

కన్నబాబు లాంటి వాళ్ళ వల్లే రాజకీయం ఇంత హీనంగా తయారవుతుందని ఆయన మండిపడ్డారు. కురసాల కన్నబాబు కాకినాడ లో ఫ్యాక్షన్ తీసుకొస్తే తరిమి తరిమి కొడతా అని హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలని తీసుకొస్తే నిన్ను వదిలిపెట్టా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలంటే పంతం నానాజీ లాంటి వాళ్ళు రావాలి. జనసేనాని గెలిపించాలి..! మా అన్నయ్య చేరదీస్తే వైసీపీ పక్కన చేరుతారా మీలాంటి వాళ్ళ వల్లే రాజకీయాలకి విలువ లేకుండా పోతుంది అని పవన్ మండిపడ్డారు. ని బుద్ది చూసే అప్పుడు చిరంజీవి నిన్ను పార్టీ నుండి గెంటేశారు.. కన్నబాబు గెట్ అవుట్ ఆఫ్ కాకినాడ, వైసీపీ పార్టీ గెట్ అవుట్ ఆఫ్ కాకినాడ అని ఆయన నినాదాలు చేశారు. ఫ్యాక్షన్ పార్టీ వైసీపీ ని దోపిడి పార్టీ అయిన టీడీపీ ని తరిమి కొట్టాలి జనసేనాని గెలిపించాలి అని ఆయన ప్రజలని కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: