ఇది టీఆర్ఎస్ దొరతనం అంతానికి ప్రారంభం..!- మధు యాష్కీ

Google+ Pinterest LinkedIn Tumblr +

రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికీ కూడా అందరి చూపు నిజామాబాద్ వైపే..! ఎందుకంటే నిజామాబాద్ లో అలాంటి పరిస్థితిలు నెలకొన్నాయి. ఒకే నియోజకవర్గం నుండి 185 మండి పోటీలో ఉన్నారు. 185 మందిలో 170 మండి వరకు రైతులే బరిలో ఉన్నారు. ఇక మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత టీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుండి సీనియర్ నేత మాధు యాష్కీ పోటీ చేస్తున్నారు దీంతో అక్కడి రాజకీయాలు మారి రసవత్తరంగా మారాయి. ప్రతిపక్షాలు రైతులకి మద్దత్తు తెలుపుతున్నారు. కులాలు వర్గాలు టీఆర్ఎస్ కి మద్దత్తు తెలుపుతున్నారు. ఇక చూడాలి గెలుపు ఎవరిది అనేది.

ఇక తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆయన కవితా పై తెరాస ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు.. విభజన చట్టంలోని అన్ని అంశాలు తీర్చడం జాతీయ పార్టీ కే సాద్యం.. అందుకే మరోసారీ పోటి చేస్తున్నా..ఒటమి భయంతో కాంగ్రెస్ ,బిజెపి కుమ్మక్కైందని అరోపిస్తున్నారు.. దైర్ఘ్యం ఉంటే.. నిజనిజాలు బయట పెట్టాలి.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా… లేదా నువ్వు పోటి నుంచి తప్పుకుంటవా అని కవిత కి మధు యాష్కి సవాల్ విసిరారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్యే పోటి. ప్రధానితో సెల్పి దిగేందుకు చూపిన అతృత..అభివృద్ధి లో కవిత చూపలేదు అని ఆయన మండిపడ్డారు. జిఎస్టి, నోట్ బంధి ఇతర అంశాలలో బీజేపీ కి టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. టిఅర్ఎస్, బిజెపి రెండు ఒకటే… నిజామాబాద్ లోక్ సభ పరిధి లో తిరుగుబాటు మొదలైంది. ఇదీ టీఆర్ఎస్.. దోరతనం అంతానికి ప్రారంభం. కోడ్ వచ్చిన తరువాత కుల సంఘాలకు అనైతికంగా ప్రోసిడింగ్ ఇస్తున్నారు.. ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేశాం. పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు దర కాంగ్రెస్ తోనే సాద్యం అని ఆయన స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: