ఎన్నికల ప్రచారానికి చివరి గడువు మరి కొద్ది సేపటికి చేరిపోయింది నేడు సాయంత్రం 6 గంటలకి ప్రచారానికి సమయం గడుస్తుంది. ఇక 6 గంటలకల్లా నేతలందరు తమ ప్రచారాలు ముగించుకోవల్సి ఉంది. ఆరు గంటల తరువాత ప్రచారల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలు పంచుకుంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే.. దీంతో నేతలు ఇక ప్రచారాలు ముగించుకునే క్రమంలో ఉన్నారు. అధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన ప్రచారం లోని చివరి గంటని.. గోల్డెన్ హవర్ గా ప్రస్తావిస్తున్నారు. తన చివరి గంట లో చేసే ప్రసంగం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఎన్నికలకీ సంబంధించి ఆకరి రోజ్డ్ షో ని తాడికొండ లో నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. సమయం దేగ్గర పడుతుంది.. పెద్దగా సమయం లేని పరిస్థితి. సాయంత్రం 6 గంటలకి ప్రచార గడువు ముగియనుంది. చివరి ఒక్క గంట గోల్డెన్ అవర్ అని ఆయన అన్నారు. 5 గంటల నుండి 6 గంటల మధ్య ఆయన 5 కోట్ల మందిని ఉద్దేశించి ప్రసంగం చేయ వలసిన అవసరం ఉందని ఆ ప్రసంగం చాలా కీలకమని తెలియజేశారు. ఇక తాడికొండ లో నిర్వహించిన సభనే చివరి సభ గా ఆయన ప్రజలకి తెలియజేశారు.. మీ అందరి అనుమతి తో ఆశీస్సులతో నిశ్చింతగా తిరిగి వెళుతున్నా ఇన్నేళ్లు మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్కున్నందుకు సంతోషంగా ఉంది నన్ను ఆశీర్వదించండి అని ఆయన ప్రజలతో అన్నారు.