20 శాతం అదనంగా అధికారులకి విధులు..! పోలింగ్ అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కోసం కర్నూలు జిల్లాలో సర్వం సిద్ధమైంది… జిల్లాలో మొత్తం 3,781 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11వ తేదీ జరిగే ఎన్నికల్లో 27,537 మంది పీవోలు, ఏపీవోలు, వోపీవోలు విధులు నిర్వహించనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఒక పీవో, ఒక ఏపీవో, నలుగురు వోపీవోలు విధులు నిర్వహిస్తారు. ఈ ప్రకారం 3,781 పోలింగ్‌ కేంద్రాల్లో పీవోలు 4,725, ఏపీవోలు 4,753, వోపీవోలు 18,059 మందిని నియమించారు. అవసరం అయిన సిబ్బంది కంటే 20 శాతం అదనంగా విధులకు కేటాయించారు. నియోజవర్గాల వారీగా అవసరమైన సిబ్బంది, కేటాయించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి..

• ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 294 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 380 మంది పీవోలు, 365 ఏపీవోలు, వోపీవోలు 1176 అవసరం కాగా 1,389 కేటాయించారు.

• శ్రీశైలం నియోజవకర్గంలో 224 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 282 మంది పీవోలు, 282 ఏపీవోలు, 896 వోపీవోలు అవసరం కాగా 1090 మందిని కేటాయించారు.

• నందికొట్కూరు నియోజకవర్గంలో 245 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 301 మంది పీవోలు, 294 ఏపీవోలు, వోపీవోలు 980 అవసరం కాగా 1109 మందిని కేటాయించారు.

• కర్నూలు నియోజకవర్గంలో 276 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 355 మంది పీవోలు, 335 ఏపీవోలు, వోపీవోలు 1104 అవసరం
కాగా 1273 మందిని కేటాయించారు.

• పాణ్యం నియోజకవర్గంలో 332 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 409 మంది పీవోలు, 401 ఏపీవోలు, వోపీవోలు 1328 అవసరం కాగా 1561 మందిని కేటాయించారు.

• నంద్యాల నియోజవర్గంలో 277 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 353 మంది పీవోలు, 362 ఏపీవోలు, వోపీవోలు 1108 అవసరం కాగా 1290 మందిని కేటాయించారు.

• బనగానపల్లె నియోజకవర్గంలో 285 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 354 మంది పీవోలు, 362 ఏపీవోలు, వోపీవోలు 1140 అవసరం కాగా 1374 మందిని కేటాయించారు.

• డోన్‌ నియోజవర్గంలో 289 మంది పీవోలు, 289 ఏపీవోలు అవసరం కాగా 357 మంది పీవోలు, 352 ఏపీవోలు, వోపీవోలు 1156 అవసరం కాగా 1345 మందిని కేటాయించారు.

• పత్తికొండ నియోజకవర్గంలో 254 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 311 మంది పీవోలు, 305ఏపీవోలు, వోపీవోలు 1016 అవసరం కాగా 1210 మందిని కేటాయించారు.

• కోడుమూరు నియోజకవర్గంలో 271 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 336 మంది పీవోలు, 344 ఏపీవోలు, వోపీవోలు 1054 అవసరం కాగా 1388 మందిని కేటాయించారు.

• ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 271 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 326 మంది పీవోలు, 376 ఏపీవోలు, వోపీవోలు 1084 అవసరం కాగా 1298 మందిని కేటాయించారు.

• మంత్రాలయం నియోజకవర్గంలో 236 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 282 మంది పీవోలు, 317 ఏపీవోలు, వోపీవోలు 944 అవసరం కాగా 1123 మందిని కేటాయించారు.

• ఆదోని నియోజకవర్గంలో 253 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 319 మంది పీవోలు, 320 ఏపీవోలు, వోపీవోలు 1012 అవసరం కాగా 1214 మందిని కేటాయించారు.

• ఆలూరు నియోజకవర్గంలో 294 మంది పీవోలు, ఏపీవోలు అవసరం కాగా 361 మంది పీవోలు, 362 ఏపీవోలు, వోపీవోలు 1176 అవసరం కాగా 11395 మందిని కేటాయించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: