ఎన్నికలు దేగ్గరకి వచ్చేశాయి పోలింగ్ కి మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది ఇప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ పోలింగ్ కి మరి కొన్ని గంటలే ఉండగా ఎన్నికల కమీషన్ అధికారులని కలిసేందుకు క్యులు కడుతున్నారు ప్రతినిధులు. ఉదయం నుంచి ద్వివేధిని కలిసేందుకు తరలివస్తున్నారు అన్ని పార్టీల ముఖ్య నేతలు.
ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ద్వివేధికి పిర్యాదులు చేస్తున్నారు పార్టీల నేతలు..
• ఉదయం ద్వివేధిని కలిసి పిర్యాదు చేసిన వైసీపీ నేత ఎంవిఎస్ నాగిరెడ్డి..
• ఎన్నికల్లో అక్రమాలపై ద్వివేధిని కలిసి వినతిపత్రం అందించి, నిరసన తెలిపిన సీఎం చంద్రబాబు..
• ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ద్వివేధిని కలిసిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ,ఙివియల్ తదితరులు,.
• మరోసారి ద్వివేధిని కలిసేందుకు రానున్న వైసీపీ నేతలు బలసౌరి,ఎంవిఎస్ నాగిరెడ్డి.
ఎన్నికలకు కొద్ది గంటల ముందు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ కార్యాలయం సాక్షిగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అన్ని పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేస్తూ రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని అధికార, విపక్షాల నేతలు ఆరోపణలు ఫిర్యాదులు చేస్తున్నారు.