సిక్స్ ప్యాక్.. వీ షేప్ బాడీ తో అదరగొడుతున్న రామ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రామ్ పోతినేని కొన్ని రోజులుగా జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు అని ఇది వరకు వార్తలొచ్చాయి అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని ఇది వరకు వచ్చిన సినిమాలన్నిటిలో నాజూకు గానే కంపించాడు కానీ ఇప్పుడు దర్శకుడు పోరి జగన్నాథ్ తో సినిమా తీస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేని కథానాయకుడు. రామ్ జిమ్ లో కష్టపడి కండలు తిరిగిన శరీరాన్ని బిల్డ్ చేసుకున్నాడు వీ షేప్ బాడీ తో పిచ్చెక్కిస్తున్నాడు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో రాపో 2.0 అని తన వీ షేప్ బాడీ తో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్ చూసిన ఆయన అభిమానులు ఫిడా అవుతున్నారు. రామ్ ఆ బాడీ సంపాదించడానికి బాగానే కష్టపడ్డాడు అని చెప్పాలి. సాధారణంగా పోరి సినిమా అంటేనే హీరో లకి అది ఒక టాస్క్. హీరోలని పూరీ ఎప్పుడూ కొట్టగానే చూపిస్తుంటాడు. ఆయన ఇది వరకే అల్లు అర్జున్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్ లని డిఫరెంట్ గా ఎలా చూపించాడో మనకి తెలుసు. టెంపర్ ద్వారా ఎన్టీఆర్ ని సిక్స్ ప్యాక్ తో చూపించి నందమూరి అభిమానులకి బాగా కనెక్ట్ అయ్యాడు ఇప్పుడు ఆయన తీస్తున్న చిత్రం లో రామ్ ని మంచి ఫిజిక్ తో చూపించి ఎంత మందిని కనెక్ట్ చేసుకుంటాడో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాని పూరీ దర్శకత్వమే కాకుండా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాని నిర్మిస్తున్నాడు. నటి ఛార్మి కూడా ఈ సినిమాకి కొ ప్రొడ్యూసర్. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: