సరిగ్గా ఈ నెల 13 వస్తే జలియన్ వాలాబాగ్ జరిగి 100 సంవత్సరాలు. 100 సంవత్స్రాలు అవ్వోస్తున్నా బ్రిటన్ ప్రభుత్వం ఏనాడు పశ్చాతాపం పడలేదు భారత్ కి క్షమాపనలు చెప్పలేదు. ఇలా వంద ఏళ్ళు గడిచాయి ఎందరో మంత్రులు వచ్చారు పోయారు.. ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. కానీ ఈ ఘటన జరిగి 100 ఏళ్ళు అవ్వోస్తుండగా ఆ దేశం ప్రధాని థెరిసా మే ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు ఒక వార్తా సంస్థ పేర్కొంది.. ఇక ఈ విషయాన్ని ఏఎన్ఐ సంస్థ ట్వీట్ చేసింది.
ఈ ఘటన 1919 ఏప్రిల్ 13 న జరిగింది, సుమారు 20 వేల మంది స్వాతంత్ర్య పోరాట సభకి పాల్గొన్నారు. అప్పుడు జనరల్ ఓ డయ్యర్ మన దేశానికి గవర్నర్ జనరల్. ఆయాన ఆదేశాల ప్రకారం బ్రిటిశ్న్ సినికులు విచక్షణ రహితంగా సుమారు 11 నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరిపారు. చిన్న పిల్లలని కూడా కాల్చి చంపేశారు.. సుమారు 1650 రౌండ్ల కాల్పులు జరిపారు, కాల్పుల్లో అధికారికంగా 379 మండి మృతులుగా పేర్కొన్నారు.. కానీ మొత్తం లెక్కలు తీయగా సుమారు 1000 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు 2000 మండి వరకు గాయపడ్డారు. వారు కాల్పులు ప్రారంభించగా భయం తో పరుగులు తీసిన జనం అక్కడ పక్కన ఉన్న బావిలోకి దూకారు. బావి లో నుండి కుప్పలు కుప్పలుగా శవాలు బయటపడ్డాయి.