రాష్ట్రంలో పోలింగ్ సంధర్భంగా పలు చోట్ల ఘర్షణలు నెలకొన్నాయి. అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న గొడవలని ఆపలేకపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరపురంలో టిడిపి వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. విచక్షణా రహితంగా ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఈ సందర్బంగా తెలుగుదేశం కార్యకర్త ఒకరు మృతి చందారు, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు జనాన్ని చెదరగొట్టారు. కట్టుదిట్టమైయన చర్యలు తీసుకుంటాం అని అధికారులు పేర్కొన్నారు.
రణరంగంలా మారిన అనంతపురం..! మృతి చెందిన కార్యకర్త..!
Share.