ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేధి ప్రెస్ మీట్..! 15 శాతానికి పోలింగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేధి మీడియాతో మాట్లాడారు. నేడు ఉదయం అన్నీ చోట్ల మాక్ పోలింగ్ నిర్వహించామని ఆ తరువాతే పోలింగ్ మొదలు అయ్యిందని ఆయన తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాతా సీఆర్సీ పూర్తి చేసినట్టుగా ఆయన తెలియజేశారు. కేవలం ఆరు చోట్ల సీఆర్సీ జరగలేదని మాక్ పోల్ నిర్వహణ జరిగిన తరువాత సీఆర్సీ పూర్తి చెయ్యకుండా ఎన్నిక నిర్వహించిన చోట అధికారులపై చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 344 సమస్యలు నమోదయ్యాయని అన్నీ కూడా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇప్పటివరకు 43 చోట్ల ఈ‌వీ‌ఎం లు మార్చినట్టు మరో 29 చోట్ల ఈ‌వీ‌ఎం లు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 6 చోట్ల ఈ‌వీ‌ఎం లు ధ్వంసం చేసినట్టుగా ఆయన తెలియజేశారు. ఆ ఆరు చోట్ల కొత్త ఈ‌వీ‌ఎం లు పెట్టినట్టుగా ధ్వంసం చేసిన వారిపై ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 12 చోట్ల పోలింగ్ కేంద్రం బయట గొడవలు జరిగాయన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద గొడవలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.

ఓటు జంప్ అవుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఆయన అన్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా హెల్ప్ లైన్ ద్వారా వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఉదయం 11 గంటల లోపు రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం పోలింగ్ నమోదయ్యిందని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కి అధికారులకి ప్రతీ ఒక్కరూ సహకరిచాలని ఆయన కోరారు, ఇవాలా సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి వోటు వినియోగించుకునే హక్కు కల్పిస్తామని ఆయన తెలియజేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: