ఒక చిన్న కారణం వల్ల ఏర్పడిన గొడవ ఘర్షణగా మారింది.. ఘర్షణ పెద్దగా మారి ఇద్దరి ప్రాణాలు తీసింది. అనంతపురం తాడిపత్రి మీరాపురం లో ఒక నాన్ లోకల్ వ్యక్తి ఓటు వేసేందుకు కార్యాలయానికి వచ్చాడు.. దీంతో తనకి అక్కడ ఓటు లేదని వైసీపీ నేతలు అడ్డుకున్నారు ఆ వ్యక్తికి మద్దత్తుగా టీడీపీ నేతలు అండగా నిలిచారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకి దారి తీసింది ఒకరి పై ఒకరు రాళ్ళు విసురుకున్నారు తలలు పగిలాయి ఇద్దరి ప్రాణాలు కూడా పోయాయి టీడీపీ నేత సిద్ధా భాస్కరరెడ్డి వైసీపీ నేత పుల్లారెడ్డి ప్రాణాలు కోల్పోయారు ఒక టీడీపీ కార్యకర్త ముగ్గురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని వర్గాలని చెల్లాచదురు చేశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు గొడవకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికలు కి బదులుగా రణరంగాన్ని తిలకించారు. ఇక ఆ ప్రదేశానికి పోలీసులు బారిగా తరలి వచ్చారు ఇప్పుడు అక్కడ పరిస్థితి కాస్త సద్దుమనుగుతుంది.
రణరంగం..అనంతపురం..! ఇద్దరికి చేరిన మృతుల సంఖ్య..!
Share.