ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.. ఇది వరకు కంటే మెరుగ్గా పోలింగ్ శాతం నమోదయ్యింది. పోలింగ్ శాతంతో పాటే ఈవీఎంల మొరాయింపులు పోలింగ్ బూత్ ల వద్ద గొడవలు కూడా ఎక్కువే జరిగాయి. అధికార టీడీపీ పార్టీ వైసీపీ వర్గాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితులు. ఇరు వర్గాల ఘర్షణల్లో 36 మంది గాయపడ్డారు, మరో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు.
మద్దత్తుదారులు గొడవలు పెట్టుకోవడమే కాదు అభ్యర్థులపైనూ దాడులకి పాల్పడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ టీడీపీ అభ్యర్థి కోడెల శివ ప్రసాద్ పై రాళ్ళతో దాడులు చేశారు ప్రతిపక్ష పార్టీ మద్దత్తుదారులు. ఈ దాడి వెనుక అక్కడి ప్రతిపక్ష పార్టీ వైసీపీ అభ్యర్థి హస్తం అంబటి రాంబాబు హస్తం ఉందని వార్తలొచ్చాయి.
ఇక ఈ వార్తాలకి ఆయన స్పందించారు రాంబాబు శుక్రవారం నాడు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అదంతా సానుభూతి కోసం తమపై తామే చేయించుకున్న దాడని ఆయన కొట్టి పారేశారు. సత్తెనపల్లిలో ఓడిపోవడం పక్కా అని తెలిసి ఈ చర్యకి ఆయన పాల్పడ్డాడని రాంబాబు వ్యాఖ్యానించారు. కోడెలపై దాడికి తనకు సంబంధం లేదన్నారు. కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నేతలు ఎవరూ కూడ దాడి చేయలేదన్నారు. ఏపీలో ఐదేళ్లపాటు చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారన్నారు. అందుకే ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అంబటి రాంబాబాు అభిప్రాయపడ్డారు.