ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ట్వీట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎందరు ఇబ్బందులకి గురిచేసిన ధర్మాన్ని విడిచిపెట్టలేదని ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరాముడి మార్గదర్శకతనే మనందరికీ స్పూర్తని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మ రక్షకుడు శ్రీ రామచంద్రుడి బాటలోనే గడిచిన ఐదేళ్లు పాలన అందించామని ఆయన స్పూర్తితోనే అభివృద్ది చేయగలిగామని బాబు తెలియజేశారు. ధర్మాన్ని అభివృద్దిని అంధించాము పాలించాము కాబట్టే అంతిమంగా ధర్మమే గెలవబోతుందని ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు.
ఆయన తన ట్వీట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీ రామచంద్రుడే మనకు మార్గదర్శి. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీ రాముడి బాటలో ఐదేళ్లూ సుపరిపాలన సాగించాము. ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం. అభివృద్ధికే ప్రజల పట్టాభిషేకం’ అని ట్వీట్ చేశారు.
తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీ రామచంద్రుడే మనకు మార్గదర్శి. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీ రాముడి బాటలో ఐదేళ్లూ సుపరిపాలన సాగించాము. ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం. అభివృద్ధికే ప్రజల పట్టాభిషేకం.
— N Chandrababu Naidu (@ncbn) April 14, 2019