అంబేద్కర్ నే స్పూర్తిగా భావించి రాష్ట్రాన్ని సాధించాం..!- కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే దివంగత నేత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వారిపై ఉన్న అంటురానితనాన్ని తరిమికొట్టడానికి తుడిచివేయడానికి నిశ్చలంగా ఉద్యమాలు చేసిన నేత, భారత రాజ్యంగ నిర్ణేత నిర్మాణ కర్త డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 128 వ జయంతి. దేశ వ్యాప్తంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాల వద్ద నివాళీలు అర్పించుకున్నారు రాజకీయ నేతలు. ఆయన కృషి మరువలేనిదని ఆయన రాసిన రాజ్యాంగం అధ్బూతమైనదని కితాబులు ఇచ్చుకుంటూ ఆయనని తలుచుకున్నారు.. ఆయన సాధించిన విషయాలని విజయాలని గుర్తుచేసుకున్నారు.

ఈ సంధర్భంగా తెలంగాణ రాష్ట్రం టీ‌ఆర్‌ఎస్ భవన్ లో ఆయన విగ్రహానికి నివాళీలు అర్పించారు టీ‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కృషి మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాల విషయంలో అంబేద్కర్ ఆలోచనలే స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేపట్టాడని ఆయన తెలియజేశారు. రాష్ట్ర సాదానకి ఆయన ఉద్యమ భావమే ఎంతగానే స్ఫూర్తిని ఇచ్చిందని ఆయన తెలియజేశారు. అంబేద్కర్ ఏ స్ఫూర్తిగా భావించి కేసీఆర్ ఉద్యమం చేశాడని ఆయన నినాదాలనే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉపయోగించారని ఆయన అన్నారు. కాగా, పంజాగుట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం విషయంలో జరిగిన వివాదంపై కేటీఆర్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: