అనిల్ అంబానీ ఇప్పటికే రాఫెల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఫ్రాన్స్ కి చెందిన ఒక పత్రిక కథనం ఆయనని మరింతగా దెబ్బ తీసెట్టు కనిపిస్తుంది. ఫ్రాన్స్ కి చెందిన లీ మోండే అనే పత్రిక ప్రచూరితం చేసిన కథనంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రాన్స్ లోని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అనే సంస్థ పై ఏకంగా 143.7 మిలియన్ డాలర్ల పాన్నుని మాఫీ చేసినట్టుగా వారు పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకి వచ్చినప్పుడు 2015 లో ఆయన రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇక అదే సమయంలో ఆ సంవత్సరం అక్టోబర్ లో ఫ్రాన్స్ ప్రభుత్వం అనిల్ సంస్థ పై పన్ను మాఫీ చేసిందని. మోదీ 36 రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశాడు తరువాత అనిల్ సంస్థ పై పన్ను మాఫీ జరిగింది అని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఇక 2007 నుండి 2010 వరకు ఆ సంస్థ పన్ను 60 మిలియన్ యూరోలు ఉండగా సంస్థ పన్ను చెల్లించలేక పోవడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కంపెనీ పై చర్యలు చేపట్టింది. ఇక అప్పటికీ 7.6 మిలియన్ డాలర్లు కంపెనీ చల్లిస్తానంటే ప్రభుత్వం నిరాకరించింది. అదే మళ్ళీ మోదీ పర్యాటనకి వచ్చిన తరువాత అదే ప్రభుత్వం ముందు నిరాకరించినప్పటికీ మోదీ రాక తరువాత అదే కంపెనీ కి పన్ను మాఫీ చేసిందంటూ ఆ కథనం లో పేర్కొంది. ప్రస్థుతం ఆ కథనం పై అందరి దృష్టి మల్లుతుంది ఇక త్వరలో అనీల్ అంబానీ ఈ విషయం పై స్పందించాల్సి ఉంది.