ఫ్రెండ్ పెళ్ళిలో సందడి చేసిన సమంత…

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం మజిలీ సినిమా హిట్ ను ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది సమంత. తాజాగా ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేసింది. క్రిస్టియన్ మ్యారేజ్ లో భాగంగా పెళ్లి కూతురు వైట్ గౌన్ లో మెరవగా..మిగతా ఫ్రెండ్స్ అంత బ్లూ కలర్ డ్రెస్ లో అంతా ఒకే డ్రెస్ కోడ్ లో కనిపించారు. ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..తనకు ఇష్టమైన పెళ్లి కుమార్తె అయిన తన స్నేహితురాలికి శుభాకాంక్షలు చెప్పారు. ఆమె మనసు ఎంతో మంచిదని మెచ్చుకున్నారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనంటూ గ్రూప్‌ ఫొటో షేర్‌ చేసింది సామ్.
ఇదిలా ఉంటె..సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో సామ్‌ నటిస్తున్నారు. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. దిల్‌రాజు తెలుగు రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: