బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై దిల్లీ క్యాపిటల్స్‌కు బోలెడన్ని ఆశలు ఉన్నాయి. కోచ్ రికీ పాంటింగ్, సలహాదారు గంగూలీకి అతడిపై అపారమైన గురి. అందుకు తగ్గట్టే ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12.6వ బంతికి కొలిన్ ఇంగ్రామ్ ఔటయ్యే సరికి స్కోరు 112/3. ఇక ఆ జట్టు 160 చేస్తే ఎక్కువే అనుకున్నారు. క్రీజులోకి వచ్చిన పంత్ సైతం ఎదుర్కొన్న ఐదో బంతి వరకు ఖాతా తెరవలేదు. ఆ తర్వాతే మొదలైంది సిక్సర్ల వర్షం. బంతి ఎటువేసినా లెగ్సైడ్లోనే సిక్సర్‌గా వెళ్లింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది అతడి యార్కర్‌ను డీప్‌స్క్వేర్ లెగ్‌లో స్టాండ్స్ దాటించేశాడు పంత్.
18 బంతుల్లో అర్ధశతకం సాధించేశాడు. మొత్తం 78 పరుగులు చేశాడు. దిల్లీ నిర్దేశించిన 213 లక్ష్య ఛేదనలో ముంబయి 176కే పరిమితమైంది. వెస్టిండీస్ వీరుడు ఆండ్రీ రసెల్ ఈ సీజన్లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మైదానం ఆవలకు బంతులు పంపిస్తున్నాడు. అతడికి బంతులేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు జంకుతుండటం గమనార్హం. రసెల్ ఈ ఐపీఎల్లో రెండుసార్లు తక్కువ బంతుల్లో అర్ధశతకాలు చేశాడు. ఏప్రిల్ 19న బెంగళూరుపై 214 పరుగుల లక్ష్య ఛేదనలో 21 బంతుల్లోనే 50 చేశాడు. 79 పరుగుల వద్ద రాబిన్ ఉతప్ప ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన రసెల్ (65) విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి పెవిలియన్ చేరడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.
చెలరేగి..అర్ధశతకాలు సాధించిన వీరులు
Share.