టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ .. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నాడా..? అంటే అవుననే చెప్పక తప్పదు.. ఎందుకంటే, వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో కోహ్లీ చేతి వేలికి దెబ్బ తగిలింది. విండీస్ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కీమర్ రోచ్ వేసిన 27 ఓవర్లో కోహ్లి కుడి చేతి వేలికి గాయమైంది. దాంతో టీమ్ ఫిజియో ఆ గాయానికి ప్రథమచికిత్స చేయాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కానింగ్ కూడా నిర్వహించినట్టు తెలిసింది. అయితే గాయం కావడంతో విండీస్‌తో తొలి టెస్టుకు కోహ్లి దూరమవుతాడనే వార్తలు వచ్చాయి. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేదని తేలిందని, వేలి ఎముక విరగలేదని పరీక్షలో వెల్లడైందని తెలిపాడు. ఎముక విరిగివుంటే బ్యాటింగ్ కొనసాగించేవాడ్ని కాదని స్పష్టం చేశాడు. ఇది తేలికపాటి గాయమేనని, విండీస్ తో తొలి టెస్టులో తప్పకుండా ఆడతానని కోహ్లీ వివరించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సూపర్ సెంచరీ సాయంతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
కోహ్లీకి చేతికి గాయం..అయినా సరే అంటూ..!
Share.