దేవుడి స్క్రిప్ట్..జగన్ పై బాబు పంచ్ అదిరిందిగా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని కీలక భవనాలకు, రహదారులకు త్రివర్ణ పతాక రంగులను వెదజల్లే విద్యుద్దీపాలతో అందంగా అలంకరణ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం పట్ల చంద్రబాబునాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని పేర్కొన్నారు. ఎవరైతే రాజధాని అమరావతిని భ్రమరావతి అని, గ్రాఫిక్స్ మయం అని విమర్శించారో, దేవుడు ఇప్పుడు వాళ్లతోనే అమరావతికి లైటింగ్ వేయించి, అందంగా చూపించేలా చేశాడని వ్యాఖ్యానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: