టీడీపీ చరిత్ర క్లోజ్ అంటున్న ఎంపీ గరికపాటి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని స్పష్టం చేసారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దశ, దిశ చూపే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని అయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అవసరం తప్పదని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలోకి భారీ సంఖ్యలో వలసలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉమ్మడి 10 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు ఎంపికైన గరికపాటి మోహన్ రావు ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. గరికిపాటి మోహనరావుతోపాటు మరో నలుగురు కలిసి రాజ్యసభలో తెలుగుదేశం పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

Share.

Comments are closed.

%d bloggers like this: