అతి కిరాతకంగా..కూతురిని కాటేసిన కన్న కామాంధుడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురి పాలిట కామపిశాచి అయ్యాడు. పాము తన గుడ్లను తానే తింటుందన్నట్లు అతి దారుణానికి పాల్పడ్డాడు.13ఏళ్ల తన కూతురిపై అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు..కాగా… ఆ మానవ మృగానికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన యాద్రాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..యాదాద్రికి చెందిన ఓ గుడి పూజారి తన కన్నకూతురిని 2006లో తన బంధువులకు దత్తతకు ఇచ్చాడు. అప్పటి నుంచి వారే ఆ పాపను పెంచుకుంటున్నారు. కాగా… ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బాలిక తన కన్నవారింటికి వచ్చింది. ఆ సమయంలో… పూజారి తన కన్నకూతురు అన్న విషయం మర్చిపోయి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అభ్యంతరకర వీడియోలు బాలికకు చూపించి… అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించాడు. కాగా… బాలిక ఈ విషయాన్ని తన పెంపుడు తల్లికి వివరించింది. దీంతో.. ఆమె వెంటనే అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోర్టులో హాజరు పరిచారు. అతని నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: