ప్రతీ క్షణం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా..లోకేష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కి శుభాకాంక్షలు తెలియజేశాడు. లోకేష్ బ్రాహ్మణిల వివాహం 2007 ఆగస్టు 26న జరిగింది వారి పెళ్లి జరిగి సరిగ్గా నేటికి 12 సంవత్సరాలు.

ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఆయన మాట్లాడుతూ తన ఆనందాన్ని తన భార్య పై తనకున్న ప్రేమని తెలియజేశాడు.. తన సతీమణి నారా బ్రాహ్మణితో దాంపత్య జీవితానికి 12 ఏళ్లు పూర్తయ్యాయని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బ్రాహ్మాణితో పెళ్లైనప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని, ప్రేమను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘12 సంవత్సరాలు, 144 నెలలు, 4,383 రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు. ప్రతి క్షణం నీ ప్రేమలోనే ఉన్న అంటూ ఇంత కాలంలో నిన్ను ప్రేమించని క్షణం ఒక్కటి కూడా లేదు  అంటూ తన ప్రేమని ఆయన తెలియజేశాడు. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: