మళ్ళీ జోడీ…దాదాపు 26 ఏళ్ల తర్వాత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పిరియాడిక్ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. మెగాస్టార్ నటిస్తున్న 152వ సినిమా కావడంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలు కానటువంటి ఈ చిత్రంకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే ఈ చిత్రంలో విజయశాంతి నటించబోతున్నారట..ఇప్పటికే చిరు మరియు విజయశాంతిల కాంబినేషన్ లో వచ్చినటువంటి అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఒకప్పుడు ఈ జంట స్క్రీన్ పై కనిపిస్తే చాలు సినిమా హిట్టు అనేలా క్రేజ్ సంపాదించుకోగలిగారు..మరి అలాంటి జంట దాదాపు 26 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇటీవలే మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రం కోసం మళ్ళీ చాన్నాళ్లకు రాములమ్మ మేకప్ వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ 152వ చిత్రంలో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో కొరటాల విజయశాంతికు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: