కన్న తల్లే కాల యముడిలా మారిన వేళ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి కాలయముడిలా మారిన సంఘటన హైదరాబాద్ కుకట్ పల్లిలో చోటు చేసుకుంది.. సొంత కూతురినే కదులుతున్న బస్సు కిందకి తోసేయాలని చూసిందో కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే.. కుకట్ పల్లి భాగ్యనగర్ కాలనికి చెందిన ఓ మహిళ తన సొంత కూతురిని కదులుతున్న బస్సు కింద తోసేయాలని చూసింది.

నది రోడ్డు పై బస్సు రావడం చూసి తన బిడ్డను విసిరేసింది. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ఆ బిడ్డని తప్పించడంతో కూతురు బతికిందని భావించిన ఆ తల్లి ఆ పాపను మరోసారి రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఆ కఠినాత్మురాలికి బుద్ది చెప్పారు. ఆ తల్లిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. చిన్నారిని ఆ తల్లి ఎందుకు బస్సు కిందకు విసిరేసిందనే విషయమై కారణాలు అడిగితె కారణాలు తెలియదు అని చెప్పింది.

Share.

Comments are closed.

%d bloggers like this: