శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సూళ్లూరుపేట సమీపంలో యూవీ క్రియేషన్స్ వారు నూతనంగా నిర్మించిన V Celluloid మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ ప్రారంభోత్సవం లో సినీ హీరో రాంచరణ్ పాల్గొన్నారు . రేణిగుంట నుండి సూళ్లూరుపేటకు వచ్చిన రాంచరణ్ ముందుగా ధియేటర్ ను పరిశీలించారు.. అనంతరం బిగ్ స్క్రీన్ ముందు కూర్చొని అందరితో పాటు సాహూ ట్రైలర్ ను అలాగే మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి ట్రైలర్ ను వీక్షించారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద ధియేటర్ ను నిర్మించి ప్రజలకు అందించడం పట్ల ఆయన అభినందనలు తెలియజేసారు. రాంచరణ్ తో పాటు సాహూ డైరెక్టర్ సుజిత్ రెడ్డి ,మ్యూజిక్ డైరెక్టర్ సీమాటోగ్రాఫర్ సాహూ నిర్మాతలు వంశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ,ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొనడం జరిగింది.
ఒకే స్క్రీన్ లో “సాహో” “సైరా” చూసిన రాంచరణ్..!
Share.