2019 ఎన్నికల ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ పార్టీ తన బలాన్ని ఉత్సాహాన్ని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలలో మళ్ళీ జోష్ నింపాలని ఆయన భావిస్తున్నారు.. కార్యకర్తలలో కొండంత, ఉత్సాహాన్ని నమ్మకాన్ని నింపాలని ఆయన డిసైడ్ అయ్యారు. వారిని తిరిగి యాక్టివ్ చేయడానికి ఆయన తోరణం కట్టుకున్నారు. ఇందుకు గాను స్వయంగా ఆయనే రంగంలోకి దిగనున్నారు అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.
పార్టీని బలోపేతం చేయడం పై చంద్రబాబు ఆసక్తిని చూపుతున్నారు. ప్రతి జిల్లాకి వెళ్ళి క్షేత్ర స్థాయిని నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను ప్రతి జిల్లాకి ఆయన వెళ్లనున్నారు ప్రతి వారంలో రెండు రోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు పాటు ఉండి అక్కడి కార్యకర్తలతో నేతలతో సమావేశం అవ్వబోతున్నారు. సెప్టెంబర్ 5 వ తేదీన తూర్పు గోదావరి జిల్లాతో మొదలుకొని ఆయన పర్యటన ప్రారంభం అవ్వబోతుందని పార్టీ వర్గాల సమాచారం.