మద్యాన్ని అరికట్టేందుకు సీఎం అడుగులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను మాట ఇచ్చిన విధంగానే ఆ మాటని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో మద్యపానాన్ని దశల వారీగా నిషేదిస్తామని ఆయన ప్రచారంలో చ్వెప్పినట్టుగానే దానికి తగ్గట్టు అడుగులు వేస్తున్నారు సీఎం. నూతన ఎక్సైజ్ నిబంధనలని పాలసీ ని ఇప్పటికే విడుదల చేసిన ఏపీ సర్కారు సెప్టెంబర్ 1 నుండి ఆ పాలసీని అమలు లోకి తీసుకురానున్నారు. కొత్త పాలసీతో పాటు ప్రభుత్వ ఆద్వర్యంలో నడిచే మద్యం షాపుల నిర్వాహణ కూడా అదే రోజు ప్రారంభం కానున్నాయి.

సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలు మద్యం అమ్మకాన్ని ప్రారంబిస్తాయని 474 దుకాణాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని సీఎం తెలియజేశాడు. మద్యపాన నిషేదం కోసం డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను దాదాపుగా 500 కోట్లు ఖర్చు చేయనుంది. మద్యం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగుతుందో ఎలాంటి అనారోగ్యాలకి దారితీస్తుందో పాఠ్యాంశాలుగా పిల్లలకి తెలియజేయాలని నిశ్చయించుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: