మహా విలేఖరులపై వైసీపీ దొరల దాడులు..! ఇదెక్కడ జులుం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

విలేఖరులపై దాడులు పెరిగూయిపోతున్నాయి.. రోజుకో ప్రాంతంలో కొందరు పార్టీ నేతలు విలేఖరులపై దాడులకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరువాతా ఈ దాడుల సంఖ్య గుట్టలుగా పెరిగిపోతుంది. మొన్న అనంతపురంలో.. నిన్న చిత్తూరు జిల్లాలో విలేఖరులపై దాడులకి పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని తాము ఏమి చేసినా చెల్లుతుందనే దురుసు వైఖరి తో వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కార్వీటీ నగరంలో జీడీ చిత్తూర్ నియోజకవర్గానికి చెందిన మహా న్యూస్ రిపోర్టర్ మహాన్ దాస్ రేపోర్టింగ్ కి వెళ్ళి వస్తుండగా.. విలేఖరి మోహన్ దాస్ పై కొందరు దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు..! విలేఖరి ని చితకబాదారు..ప్రాణాపాయం నుండి బయటపడ్డ బాధితుడు ఫిర్యాదు చేయడానికి పోలీసులని ఆశ్రయించగా అతని ఫిర్యాదుని ఎవ్వరూ తీసుకోకపోవడం గమనార్హం. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం తిరుపతి లోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారు వైసీపీ కి చెందిన వారీగా మోహన్ గుర్తించారు.. దాడి చేసిన వారిలో ముగ్గురుని ఆయన గుర్తిస్తానని చెబుతున్నాడు. అధికార జులుంని అడ్డు పెట్టుకొని నిజామ్ లాగా జగన్ పాలన చేస్తున్నాడని వైసీపీ నేతలు దొరల లాగా వ్యవహరిస్తున్నారని విలేఖరుల సంఘాలు మండిపడుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: