బందోబస్త్ కి వెళ్లనున్న విజయ్ దేవరకొండ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బొందోబస్త్ కి వెళుతున్నాడు..! అదేంటి ఒక హీరో బందోబస్త్ కి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే కానీ మీరనుకుంటున్న బందోబస్త్ కి కాదు తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన బందోబస్త్ సినిమాకి ముఖ్య అతిథిగా..! సూర్య హీరోగా నటించిన  ‘బందోబస్త్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వస్తారని సమాచారం.

సాధారణంగా ఒక ఇండస్ట్రీ హీరో మరో ఇండస్ట్రీ లో నటించినపుడు లేక రీమేక్ చేసినప్పుడూ వాళ్ళకి మద్దత్తుగా అక్కడి హీరోలు వారి ఫంక్షన్లకి ముఖ్య అతిధిగా వస్తూ ఉంటారు. వచ్చి వారి సినిమాకి మంచి ప్రోమోషన్ ని మద్దత్తు ని తెలియజేస్తూ ఉంటారు. ఈక్రమంలో విజయ్ దేవరకొండ తాను నోటా సినిమా నటించినప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య తమిళ నోటా సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చి తన మద్దత్తు ని తెలిపాడు సినిమాకి గాను మంచి ప్రోమోషన్స్ కూడా ఇచ్చాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ నటించింన డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడి నటుడు యష్ వచ్చిన విషయం తెలిసిందే..

సాదారణంగా ఇండస్ట్రీల మధ్య ఇదే సాంప్రదాయం. ఇక తన సినిమాకి సూర్య ముఖ్య అతిథిగా వచ్చి ప్రోమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ హీరో సూర్య నటించిన బందోబస్త్ తెలుగు వర్షన్ సినిమాకి మద్దత్తు తెలుపుతూ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. తన భాకిని తీర్చుకుంటున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: