వివేకా హత్య కేసులో ఆత్మహత్య..! మరిన్ని ట్విస్ట్‌లు సంచలనాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని నెలలుగా కలకలం రేపుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కలకలం రేగింది ఇప్పుడు ఇదో కొత్త ట్విస్ట్..! వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడులా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక నిందితుడు ఆత్మహత్యకి పాల్పడటంతో ఇప్పుడు ఈ కేసు మరింత అనుమానాన్ని సంచలనాన్ని రేపుతోంది. పోలీసుల వేధింపులు తాళలేక తాను ఆత్మ హత్య చేసుకుంటునట్టుగా శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

వివేకా హత్య కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదని అలా ఎన్ని సార్లు మొర పెట్టుకున్న పోలీసులు వినడం లేదని వారి వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య కి పాల్పడినట్టు లేఖ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ కి వైఎస్ భాస్కర్ రెడ్డీ లకి వేర్వేరు లేఖలు రాశాడు. శ్రీనివాసు రెడ్డిని కేసు విచారిస్తున్న సీఐ రాములు దారుణంగా వేధించాదని ఈ కారణంగానే ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారని శ్రీనివాసులు రెడ్డి కొడుకు కుటుంబం ఆరోపిస్తుంది.

శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య పై తన కుమారుడు స్పందిస్తూ.. వైఎస్ వివేకా అన్నా వైఎస్ కుటుంబం అన్నా తన తండ్రికి ఎనలేని గౌరవం అని తన తండ్రికి ఈ హత్య కి ఎటువంటి సంబంధం లేదని ఆయన వెల్లడించాడు. పోలీసులు వేధించడంతో అవమానంగా భావించి క్రుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. రెండు రోజుల ముందు విచారణ నిమిత్తం పోలీసులు తన తండ్రిని తీసుకెళ్లారని అప్పటినుండి తీవ్ర భావోద్వేగానికి ఆయన గురయ్యినట్టు ఆయన కుమారుడు పేర్కొన్నాడు. ఇక శ్రీనివాసులు రెడ్డీ ఆత్మహత్యకి పాల్పడటంతో ఇప్పుడు ఈ కేసు కి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: