ఇక పై తిరుపతిలో అందరికీ వీఐపీ దర్శనాలు ఉండవు-హై కోర్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు లైన్ లలో గంటల తరబడి నిలబడి ఆ దైవాన్ని దర్శించడానికి గంటల కొద్ది వేచి చూస్తూ ఉంటారు. భక్తులకి కొన్ని సార్లు గంటలు పడితే మరి కొన్ని సార్లు ఒకటి రెండు రోజులు కూడా పడుతుంది ఆ స్వామిని దర్శించడానికి. అయినా అలాగే సంయమనంతో లైన్ లో నిలబడి ఉంటారు. ఈ లైన్ లని తప్పించుకోడానికి భక్తులూ వీఐపీ ల దేగ్గర నుండి రేకమండేషన్ పత్రాలు తీసుకొని వెళుతుంటారు. వారిని L1,L2,L3 లైన్ల ద్వారా పంపిస్తూ ఉంటారు అలా వెళ్ళిన వాళ్ళకి త్వరగా దర్శనం అయిపోతుంది.

వీఐపీ లని సైతం L1,L2,L3 లైన్ల లోనే పంపిస్తూ ఉంటారు అధికారులు. ఈ L1, L2 ,L3 దర్శనాలను రద్దు చేయాలన్న ఇప్పటికే పిటీషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ తీర్పునిచ్చింది. హై కోర్ట్ తీర్పుని ఇవ్వడం తో ఈ విషయం మరోసారి చర్చల్లోకి వచ్చింది.. దేవుడి ముందు అందరూ సమానమే, అధికారులు అందరినీ సమానంగా చూడాలి అని పిటిషనర్ కోర్ట్ ని కోరడం జరిగింది. దీనికి స్పందించిన హై కోర్ట్ తిరుమల L1, L2 ,L3 దర్శనాలు రాజ్యాంగ బద్ధమే అని స్పష్టం చేసింది.

వీవీఐపీ, వీఐపీ ల సెక్యూరిటీ పర్పస్ లో మాత్రమే ఈ దర్శనాలని అమలు చేయాలని న్యాయ స్థానం ప్రకటించింది. అంతే కాకుండా ప్రోటోకాల్ దర్శనాలను యధావిధిగా కొనసాగించవచ్చని తీర్మానం చేసింది. కొంత కాలంగా L1, L2 ,L3 దర్శనాలను ఆపివేసిన టీటీడీ ని ఉద్దేశిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బ్ల్యూ, ఎల్లో బుక్ వారికి మాత్రమే L1, L2 ,L3 దర్శనాలు ఇవ్వాలని కోర్ట్ టీటీడీ ని ఆదేశించింది. దీంతో L1, L2 ,L3 దర్శనాల వల్ల భక్తులకి కలిగే కష్టం కొంత వరకు తగ్గింది అనే చెప్పవచ్చు.

Share.

Comments are closed.

%d bloggers like this: