బాబు కి హ్యాండ్..! జనసేనానికి షేక్ హ్యాండ్..! జనసేన లోకి రాధ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వంగవీటి మోహనరంగా కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటీ..? జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ తో చర్చలు ఎందుకు చేశారు..? టీడీపీ లో చేరినా కూడా టికెట్ ఇవ్వకుండా ఎన్నికల ప్రచారకర్తగా సరిపెట్టిన టీడీపీ అధిష్టానం పై ఆయనకి మనసు పోయిందా..? జనసేన లో జాయిన్ అవుతున్నారా..? అసలు ఏం జరుగుతుంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదుల్లో వ్యక్తమవుతున్నాయి.

సంకేతాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. తాజాగా జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌‌‌‌‌కు వెళ్లారు. అక్కడ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు. దిండి రిసార్ట్స్‌లో పవన్ కళ్యాణ్‌తోనూ వంగవీటి భేటీకానున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన త్వరలో జనసేన జండా పట్టుకోబోతున్నారు అనే ఊహాగానాలే వ్యక్తమవుతున్నాయి.

మరి జనసేన అధినేత పవన్ కార్యాచరణ నచ్చిందో టీడీపీ పై కోపం వచ్చిందో కానీ.. రాధా అడుగులు మాత్రం జనసేన వైపే వెళుతున్నాయి. రాధకృష్ణ కొన్ని రోజులుగా టీడీపీ పార్టీకీ.. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు.. మీడియా కి కూడా చిక్కట్లేదు. ఆయన చివరిసారిగా వార్తల్లోకి నిలిచింది కూడా జనసేన అధినేత పవన్ తో సమావేశం అయినప్పుడే. మూడు నెలల క్రితం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ అరగంట పాటు ఆయనతో చర్చలు కూడా జరిపారు. ఆ సమయం లోనే రాధా జనసేన లో చేరబోతున్నారు అనే వార్తలు వచ్చాయి కాని రాధ పార్టీ లోకి వెళ్లలేదు.. వెలుతున్నట్టుగా కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా మరోసారి పవన్‌ను కలుస్తుండటంతో నాదెండ్ల మనోహర తో చర్చలు జరపడంతో జనసేనలోకి వెళతారనే చర్చ జరుగుతోంది. మరి ఈసారి కూడా ఆయన పార్టీలో చేరబోతున్నారు అనే విషయం లో క్లారిటీ లేదు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు కానీ పార్టీ వర్గాలు మాత్రం ఆయన జనసేన లో చేరుతున్నారు అనే అంటున్నారు. టీడీపీ లో ఆయనకి టికెట్ ఇవ్వకపోయిన క్యాంపెయినింగ్ చేశాడు.. స్టార్ క్యాంపెయినర్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఆయనకి ఎలాంటి పదవి దక్కలేదు. అందుకే ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

vangaveeti raadha to soon join in janasena

vangaveeti raadha to soon join in janasena

Share.

Comments are closed.

%d bloggers like this: