మరోసారి మామతో పని చేసే అవకాశం..! హరీష్ కి కేబినెట్ లో స్థానం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజుల నుండి ఆ మామా అల్లుళ్ళ మధ్య పరిస్థితి రాచుకున్న అగ్గిలా మారింది. పచ్చ గడ్డిలా ఉన్న వాళ్ళ బంధం అగ్గి రాచుకున్న బొగ్గులా మారింది అని తెలంగాణ రాష్ట్రం అంతటా గట్టి ప్రచారం జరిగింది. ఆ మామ అల్లుళ్లే.. హరీష్ రావు కేసీఆర్ లు..! ఇందుకు ప్రతీకాష్టగా కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత హరీష్ రావుకు తన కేబినెట్ లో చోటు కూడా కల్పించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా మాజీ నీటి పారుదల మంత్రిగా పని చేసిన హరీష్ రావు ని కనీసం ఆహ్వానించలేదు. ఇక కేసీఆర్ ఇలా చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని కొడుకు గురించి అల్లుడిని దూరం పెట్టాడని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుండి హరీష్ అభిమానులు కేసీఆర్ పై విమర్శలు చేయడం మనకి తెలిసినదే..! కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనపడటం లేదు. హరీష్ కి కేసీఆర్ మరోసారి తన కేబినెట్ లో పని చేసే అవకాశం కల్పిస్తున్నాడు.. ఇకనైనా విమర్శలు ఆగేనా..? వీరి బంధం సాఫీగా సాగేనా..?

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తరువాత ఆ పార్టీలో హరీష్ రావుకే మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకి భారీ మొత్తంలో అభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తేమి లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి హరీష్ మామ కేసీఆర్ వెంటనే ఉంటూ పార్టీ కోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. ఉద్యమ సమయంలో కూడా హరీష్ ఎంతగానో కృషి చేశారు.. మంచి ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు. తన కృషికి ఫలితంగా కేసీఆర్ తన కేబినెట్ లోని ముఖ్యమైన శాఖ అయిన నీటి పారుదల శాఖా మంత్రి పదవిని ఆయనకి అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లను విస్తృత స్థాయికి తీసుకెళ్లారు. ప్రతీ వాగును వంకను పునరుద్ధీకరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మన రాష్ట్రం లోని నేతల అభినందనలే కాకుండా పక్క రాష్ట్రం నేతలు కూడా ఆయనకి అభినందనలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు కూడా ఆయన హయాం లోనే ప్రారంభమయ్యాయి. తాను పోటీ చేస్తున్న మొదటి నుండి ఓటమిని ఎరుగకుండా గెలుస్తూనే వచ్చారు హరీష్ రావ్. మామ ఏ పని అప్పగించినా తప్పకుండా సక్సెస్ చేస్తూ వచ్చాడు హరీష్ రావు అందుకే ఆయనకి ట్రబుల్ షూటర్ గా గుర్తింపు వచ్చింది. ఇక ఈసారి కూడా అదే నమ్మకంతో పని చేస్తాడని మామ కేసీఆర్ హరీష్ కి మంత్రి వర్గంలో స్థానం కల్పించాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: