నిరంకుశ పాలన వద్దు..! రండి తమ్ముళ్లూ కలిసి పోరాడుదాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక అద్భుతమైయన అడ్మినిస్టేటర్..! అపార అనుభవం ఉన్న రాజకీయ నేత..! సామాజిక వాది ప్రజా ప్రతినిధి… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు. దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు.. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈయనని దెబ్బ తీయడమొక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఎత్తులు వేస్తుంది. అభివృద్ధి కోసం ప్రజలు తమకి అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విర్రవీగుతుంది. రౌడీఇజాన్ని తమ వైనంగా మార్చుకుంది. ప్రజలపై ప్రజావాదులపై విలేఖరులపై దాడులు.. మరికొన్ని చోట్ల హత్యలు చేస్తూ నియంత పరిపాలన చేస్తుంది. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలంటే దాని మూలాలని దెబ్బ తీయాలని ఎక్కడెక్కడ తెలుగుదేశం పవర్ఫుల్ గా ఉంటే అక్కడ తమ జండా ని ఎగిరేయాలని వైసీపీ డిసైడ్ అయ్యింది.

అసెంబ్లీ లో వినిపించే గొంతును చిదిమేయాలని ఆ నేతల పై ఐటీ దాడులు అక్రమ కేసులు బరాయిస్తుంది. టీడీపీ కి కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్న ప్రాతల్లో నేతలనీ బయపెట్టి తమ పార్టీలోకి లాగుతుంది. డబ్బు బీభత్సంగా పంచుతుంది.. ఎలాగైనా చేసి ఆ ప్రాంతాలని తమ వశం చేసుకుంటుంది. పార్టీ సీనియర్లు పార్టీని ఫిరాయించి వైసీపీ పార్టీ లోకి వెల్లడమే ఇందుకు పరాకాష్ట..! తమకి ఎవరైనా వెనుతిరిగితే ఇక వారి సంగతి అంతే.. దాడులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసులు ఎన్నో నమోదయ్యాయి.

రాష్ట్రానికి ఓ పక్క వరద ముప్పు ఉంటే మరోపక్క వైసీపీ రౌడీఇజం..! బాధితులకు భరోసా నింపేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీ కావాలని దాడులకు పాల్పడుతోందని, తాము చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అయినా జగన్ పట్టించుకోడం లేదు..! నేనింతే అనే దురుసు పాలన చేస్తున్నాడు. దొర పాలన నుండి రాయలసీమని రక్షించడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు. పల్నాడును రక్షించు కోవాలని కోరుతూ చంద్రబాబు ఛలో ఆత్మకూరు పేరుతో పిలుపునిచ్చారు. వైకాపా బాధితులంతా తరలి రావాలని కోరారు. 100 రోజుల అరాచక పాలన గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆర్ధిక మూలలను దెబ్బ కొడుతున్నారు. ఖాకీలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ బాధితులకి పునరావాస కేంద్రాలను కూడా బాబు ఏర్పాటు చేశారు. వైసీపీ దాడులకి ప్రభుత్వ నిరంకుశ పాలన కి బాధితులైన ప్రతీ ఒక్కరూ ఆ కేంద్రాలకు తరలి రావాలని చంద్రబాబు కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: