బాబు గృహ నిర్బంధం..ఛలో ఆత్మకూరు ఉద్రిక్తం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకున్నారు..అంతే కాకుండా ఆయన్ని గృహ నిర్బంధం చేసారు. దింతో పోలీసుల చర్యపై బాబు మండిపడ్డారు. తాను ఆత్మకూరు వెళ్లకుండా ఏ శక్తి అడ్డుకోలేదని… ఇది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని బాబు అభివర్ణించారు. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై నిప్పులుచెరిగారు. పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేక పోయింది. దాదాపు గంటకు పైగా బాబు కారులోనే వుండి పోయారు. శాంతియుతంగా తాము వెళుతుంటే అధికార పార్టీ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

పెద్దఎత్తున పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు బాబు వెంట ఉన్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఇవ్వాళ కాక పోయినా, రేపైనా సరే తాను వెళ్లడం ఖాయమన్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించడంపై బాబు ఫైర్ అయ్యారు. టీడీపీ ఛలో ఆత్మకూర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు సైతం బయలు దేరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నిరసనలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు పోలీసులు. కాగా అప్రతిష్ట పాలు చేసేందుకు బాబు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, దానిని తాము తప్పకుండా ఎదుర్కొని తీరుతామని బాబు చెప్పారు. బాబు, జగన్ ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు మరింత పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఈ వ్యహారంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. పల్నాడుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడులో పరిస్థితులు చక్కదిద్ధేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబుకు కుట్రలు పన్నడం కొత్త కాదని, పెయిడ్ ఆర్టిస్టులను తలపింప చేస్తున్నారని బొత్స కామెంట్స్ చేశారు. మొత్తం మీద ఛలో ఆత్మకూర్ ఏపీలో చర్చనీయాంశమైంది.

Share.

Comments are closed.

%d bloggers like this: