ఆయన పోరాడాల్సింది..! ఇలా చేస్తారు అని అనుకోలేదు..!- పవన్ కళ్యాణ్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు మృతితో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వదంతులు గుప్పుమంటున్నాయి. తెలుగు ప్రజలంతా దిగ్బ్రాంటికి లోనయినా పరిస్థితి. పల్నాటి పులిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. పేదలకి అండగా ఉంటూ ఆయన ఎంతో పోరాటం చేశారు అలాంటి వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడటం ఎవ్వరూ ఊహించని పరిణామం. గత ఎన్నికల్లో ఓడిపోవటం.. రాజకీయంగా కొంత కాలంగా విమర్శలు ఆరోపణలు ఎదుర్కోవడం ఆయనని తీవ్ర బ్రాంతి లోకి నేట్టాయి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యి అలా చేశారని కొందరు అంటున్నారు.. కుటుంబ కలహాలు అని మరి కొందరు అంటున్నారు.. ప్రభుత్వ వేధింపులే కారణం అని మరి కొందరు.. ఇలా ఆయన మారణం పై అనేక వందంతులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా రాజకీయ నేతలంతా ఆయన మరణం పై సంతాపాన్ని తెలిపేశారు. ఆయన మరణం పట్ల స్పందించారు. ఇక ఇదే నేపద్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు ఎదురుకోలేక ఆయన తుదిశ్వాస విడవటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు పవన్. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. తన తరపున, పార్టీ తరపున కోడెల మృతికి తీవ్ర సంతాపం తెలిపారు పవన్ కల్యాణ్.., ఇక కోడెల మృతిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు , తెలంగాణ సీఎం కేసీఆర్ , టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ , తుమ్మల , ఉత్తమ్ , వీ హెచ్ , సోమిరెడ్డి , పరిటాల శ్రీ రామ్ వంటి ఎందరో రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది .

Share.

Comments are closed.

%d bloggers like this: